రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను దిల్ రాజు సమర్థిస్తున్నారా..?

15
- Advertisement -

కేటీఆర్ ను విమర్శిస్తూ దిల్ రాజు ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. అసలు దిల్ రాజు ఇండస్ట్రీ పక్షాన మాట్లాడుతున్నారా.? లేకపోతే పదవి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారో క్లారిటీ ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి. ఎందుకంటే సినీ పరిశ్రమ పరువు తీస్తున్న రేవంత్ సర్కారు తీరును కేటీఆర్ ప్రశ్నించారు. కానీ దిల్ రాజు మాత్రం ఎటువైపు ఉన్నారో అర్థం కావడం లేదు. ఆయన మొదట సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లారు. మరి ప్రభుత్వానికి మద్దతుగా వెళ్లారా..? అల్లు అర్జున్ కు మద్దతుగా వెళ్లారా.? సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టడానికి హైదరాబాద్ లో వేరే స్థలాలే లేవా.? సెక్రటేరియట్ లేదా.? సీఎం నివాసం లేదా.? మీరు చైర్మన్ గా ఉన్న ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫీసు లేదా.? ఎందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ పెట్టాల్సి వచ్చిందో చెప్పండి. సినిమావాళ్లతో సీఎం మీటింగులో డీజీపీ ఎందుకు కూర్చున్నారు.? ఆయనకు ఏం పనో కూడా మీరే చెప్పండి. సినిమా పరిశ్రమ గురించే మీరు మాట్లాడాలనుకుంటే.. ఏడాది కాలంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెంకటరెడ్డితో ఎందుకు భేటీ కాలేదు.? అల్లు అర్జున్ వ్యవహారం తర్వాతే , పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎందుకు సమావేశమయ్యారు.?

అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ వైఖరి ఏంటో ఇప్పటి వరకు చెప్పలేదు. మొదట దానిపై క్లారిటీ ఇవ్వండి. సంధ్య థియేటర్ వ్యవహారంలో తప్పు ప్రభుత్వానిదా.? అల్లు అర్జున్ దా.? స్పష్టత ఇవ్వండి. రేవంత్ రెడ్డి కరెక్ట్ గానే చేశారని పవన్ కల్యాణ్ తన వైఖరిని వెల్లడించారు. కానీ మీరెందుకు దోబూచులాడుతున్నారు. సినీ పరిశ్రమపై రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్న తీరును జాతీయా మీడియా మొత్తం ఎండగట్టింది. అయినా మీరు దానిపై ఎందుకు మాట్లాడలేదు. మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మనిషా.? లేకపోతే ప్రభుత్వం మనిషా.? హీరో నాగార్జునపై, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా.?
సినిమా వాళ్లు ఏమైనా భారత్ – పాక్ సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారా.? రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా బిజినెస్ చేస్తున్నారు. డబ్బులు పెట్టి లాభాలు తీసుకుంటున్నారని.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ మీడియా ఛానల్ లో మాట్లాడారు. దీనిపై మీ వైఖరి ఏంటీ.? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సినీ పరిశ్రమకు చెందిన బడా వ్యక్తిగా మీరు సమర్థిస్తున్నారా.? లేకపోతే మీకు పదవి ఇచ్చారు కాబట్టి.. సినీ పరిశ్రమను ఎవ్వరు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా ఉంటారా.? మొదటి ఈ అంశాలపై స్పష్టత ఇవ్వండి. ఆ తర్వాత కేటీఆర్ గారిపై విమర్శలు చేయండన్నారు.

Also Read:ఆర్పీల పెండింగ్ జీతాలు చెల్లించండి: హరీశ్‌

- Advertisement -