నందినిరెడ్డి స‌మంత ‘ఓ బేబీ’..

269
samantha nandini reddy
- Advertisement -

అక్కినేని స‌మంత ఈమ‌ధ్య ల‌వ్ స్టోరీలు కాకుండా విభిన్న‌మైన సినిమాలు చేయ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తుంది. క‌థ చుట్టూ తిరిగే సినిమాల్లో న‌టిస్తూ విజ‌యాన్ని సొంతం చేసుకుంటుంది. ఇటివ‌లే ఆమె న‌టించిన యూ ట‌ర్న్ సినిమా ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి తో సినిమా చేస్తుంది.

కొరియ‌న్ చిత్రం ‘మిస్ గ్రానీ’ ఆధారంగా నందిని రెడ్డి ఈసినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. తాజాగా ఈసినిమాకు టైటిల్ ను ఖారారు చేశారు చిత్ర‌యూనిట్. ఓ బేబీ అని చిత్ర టైటిల్ ఖ‌రారు చేయ‌గా ‘ఎంత సక్కగున్నావే’ అన్నది దీనికి ఉప శీర్షిక. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. వ‌చ్చే స‌మ్మ‌ర్ లో మూవీని విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -