కింగ్‌నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) నిర్మాతలు. ఆగస్ట్ 9న సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సక్సెస్‌మీట్‌లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ నాలో కొత్తదనం చూసుకోవాలి అని ఆలోచించి `మన్మథుడు 2` చేశాను. నేను ఎక్స్‌పెరిమెంట్స్ చేసే ఇక్కడి వరకు వచ్చాను. మన్మథుడు 2కూడా అలాగే చేశాం. అయితే దీన్ని వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. కాస్త సమయం తీసుకుంటుంది. కలెక్షన్స్ చూసి చాలా సంతోషమేసింది. అందరూ ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. ఒక పక్క బిగ్‌బాస్ సంతోషం.. మరో పక్క ఇదొక సంతోషం. తల్లికొడుకుల మధ్య అనుబంధం, తల్లి పడే తాపత్రయం, నాకు, వెన్నెల కిషోర్ మధ్య ఉండే కామెడీ.. అన్ని ప్రేక్షకులకు నచ్చుతాయి.
కలెక్షన్స్ బావుంటేనే నిర్మాత మరో సినిమా తీయగలుగుతాడు. `ఆర్.ఎక్స్ 100` సినిమాలో సాంగ్స్ చూసి నచ్చి చైతన్‌ని పిలిచి మ్యూజిక్ చేయమని అన్నాను. తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రెండు సాంగ్స్ ట్రెండింగ్‌లో కూడా ఉన్నాయి. `నిన్నేపెళ్ళాడతా` తర్వాత లక్ష్మిగారితో నటించాలని అనుకున్నాను. అయితే ఆమెకు సూట్ అయ్యే రోల్ దొరకలేదు. ఈ సినిమాలో మళ్లీ ఆమెతో నటించే అవకాశం దక్కింది. చాలా హుందాగా నటించారు. రకుల్ ఎక్సలెంట్. చాలా పర్‌ఫెక్ట్‌గా నటించింది“ అన్నారు.
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – “ఫస్ట్ డే ఉన్న టెన్షన్ నాకే తెలుసు. థియేటర్స్‌కి వెళ్లి అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో చెప్పమని నాగార్జునగారు చెప్పమన్నారు. నేను నా టీమ్‌తో వెళ్లి చూశాను. ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్‌సార్, వెన్నెల కిషోర్ కామెడీ, అవంతిక క్యారెక్టర్ నచ్చేసింది అందరూ క్లాప్స్ కొడుతున్నారు. క్లైమాక్స్‌ని సైలెంట్‌గా చూసి ఓ స్మైలింగ్‌తో బయటకు వచ్చారు“ అన్నారు.