బంగార్రాజు ట్రైలర్‌ వచ్చేసింది..

17

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను వదిలారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. ఆ పాత్రల కాంబినేషన్లోని ఇంట్రెస్టింగ్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. మరి మీరూ ఓలుక్కెయండి..!

Bangarraju Trailer | Akkineni Nagarjuna | Akkineni Naga Chaitanya | Ramya Krishna | Krithi Shetty