దర్శకుడు కె. విశ్వనాథ్ ఇంటికి సీఎం కేసీఆర్

668
Cm Kcr Director K. Vishwanath
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు సీఎం కేసీఆర్. విశ్వనాథ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన్ను ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్ధితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ముచ్చటించారు.

కాగా దర్శకుడు కే విశ్వనాధ్ కెరీర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణం, స్వాతిముత్యం , సాగరసంగమం, సిరిసిరిమువ్వ, స్వయంకృషి వంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సహకరించక పోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

- Advertisement -