అభిమాని మరణంతో అక్కినేని కుటుంబంలో విషాదం..!

359
- Advertisement -

స్టార్ హీరోల వీరాభిమానులు మరణిస్తే, స్టార్లు సైతం వాళ్ళకి నివాళులర్పించడం మనం చూస్తూనే ఉంటాం. మిగతా అభిమానులు వాళ్ళకి ఘనం గా నివాళులర్పించి అంత్యక్రియలను పూర్తి చేయడం సహజం. ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో కూడా అలాంటి విషాద ఛాయలే అలుముకున్నాయ్.

Akkineni fans association president Ravinder Reddy dies

అక్కినేని నాగేశ్వరరావుకి వీరాభిమాని ఐన రవీందర్ రెడ్డి ఇండస్ట్రీ వాళ్ళకి పరిచయమే. కాగా 2 రెండు రోజుల క్రితం ఆయన తుది శ్వాస విడువడంతో అక్కినేని అభిమానులంతా సోషల్ మీడియాలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అక్కినేని నాగార్జున కూడా ఓ మంచి సన్నిహితుడిని కోల్పోయినందుకు బాధపడుతున్నట్టు పోస్ట్ పెట్టి తన సంతాపం వ్యక్తం చేసారు.

Akkineni fans association president Ravinder Reddy dies

 

రవీందర్ రెడ్డి అక్కినేని ఫ్యామిలీకి ఎంత సన్నిహితమో సినీ పరిశ్రమ ప్రముఖులకు బాగా తెలుసు. అక్కినేని ఇంట్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా, అందులో రవీందర్ రెడ్డి పాత్ర ఉండాల్సిందే. నాగేశ్వరరావు ,నాగార్జునల సినిమా కథలను చర్చించటం లో కూడా రవీందర్ రెడ్డి పాల్గొనేవాడట. అంత మంచి సన్నిహితుడు కోల్పోయిన అక్కినేని కుటుంబంకు ఓ తీరని లోటు ఏర్పడిందనే చెప్పాలి.

- Advertisement -