సిల్లీగా నవ్విస్తున్న “సిల్లీ ఫెలోస్ “..!

209
Silly Fellows Official Trailer released today
- Advertisement -

సుడిగాడు తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న భీమినేని శ్రీనివాస్ గారు మళ్ళీ ఈ సారి ఇద్దరు హీరోలతో కలిసి సిల్లీ ఫెలోస్ అంటూ రాబోతున్నాడు. సునీల్ ,అల్లరి నరేష్ హీరోలుగా వస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

Silly Fellows Official Trailer released today

మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా క్రియేట్ చేయబడిందనే చెప్పాలి. అల్లరి నరేష్ , సునీల్ ఇద్దరూ మంచి కామెడీ టైమింగ్ తో అలరించగా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం , జయప్రకాశ్ రెడ్డి తమ తమ శైలిలో హాస్యాన్ని పండించారు. సునీల్ ఒకప్పటి తన కామెడీ స్టైల్ ని మళ్ళీ ఈ సినిమాలో బయటపెట్టి “హి ఈజ్ బ్యాక్” అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మధ్యలో అర్జున్ రెడ్డి ,RX 100 సినిమాలను గుర్తుచేయడం మంచి ఫన్ ని క్రియేట్ చేసిందనే చెప్పాలి.

Silly Fellows Official Trailer released today

మొత్తానికి ఎంతో హాస్యపూరితంగా తెరకెక్కిన ఈ ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ ట్రైలర్ ను విడుదల చేసిన మహేష్ బాబు చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ చెప్పాడు. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న నరేష్, సునీల్, భీమినేని ముగ్గురికీ మరిచిపోలేని హిట్ ని ఇవ్వాలని ఆశిద్దాం.

- Advertisement -