అలా సిగెరెట్ తాగి సంవత్సరం అయ్యింది – అర్జున్ రెడ్డి .!

352
- Advertisement -

అందరిలా సాదా సీదాగా కనిపించే కుర్రాడు ఒక్క సంవత్సరం లో అర్జున్ రెడ్డి అయిపోయాడు. దాన్నే టైం అంటారు. అది వచ్చేంతవరకు ఎవరు ఏ రేంజ్ లో ఉంటారు అనేది ఎవ్వరూ చెప్పలేరు. అల్లాటప్పాగా కనిపించేవాడు కూడా అర్జున్ రెడ్డి అయిపోవచ్చు. ఇది జీవితం .. ఇక్కడ ఏమైనా జరగొచ్చు.

Vijay deverakonda's Arjun Reddy completes one year

 

ఆగష్టు 25 , 2017 ..అర్జున్ రెడ్డి థియేటర్ లోకి అడుగుపెట్టిన రోజు. చిన్నపాటి అంచనాలతో రంగ ప్రవేశం చేసిన ఈ సినిమా దేశం మొత్తం సంచలనం సృష్టించింది. సినిమా చరిత్ర సృష్టించాలంటే కథలో బలం, క్యారెక్టర్లో సత్తా ఉంటే చాలని నిరూపించిన సినిమా అర్జున్ రెడ్డి. నిన్నటితో సంవత్సరం పూర్తి చేసుకున్న ఈ సినిమా ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పెట్టాడు అర్జున్ రెడ్డి. అదే.. మన విజయ్ దేవరకొండ.

Vijay deverakonda's Arjun Reddy completes one year

ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వీరంగం సృష్టిస్తుంది. రక్తం తో నిండిన చేతులతో సిగిరెట్ తాగుతున్నట్టుగా ఉన్న ఆ ఫోటో పెట్టి ఒక సంవత్సరమైనట్టు గుర్తు చేసుకున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి గా దిగిన మొట్టమొదటి ఫోటో అని పోస్ట్ చేయడంతో, ఆ ఫోటోకి క్షణాల్లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.తక్కువ కాలం లో ఇంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ను , ఆ సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి ని ఎవ్వరైనా మెచ్చుకోవాల్సిందే.

- Advertisement -