అ! దర్శకుడితో అఖిల్..!

585
akhil

అక్కినేని అఖిల్‌…ఇప్పటివరకు నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు కమిట్ అయ్యారు అఖిల్.

అ! దర్శకుడు ప్రశాంత్ వర్మతో తన ఐదో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అఖిల్. ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడట. వాస్తవానికి కాజల్ ప్రధాన పాత్రధారిగా ఒక సినిమాను రూపొందించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఆలస్యం అవుతుండటంతో అఖిల్ ను లైన్లో పెట్టేశాడు ప్రశాంత్. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సూపర్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అఖిల్ కు ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.