అక్కినేని నాగార్జును రెండవ కుమారుడు అఖిల్ ప్రస్తుతం మిస్టర్ మజ్ను సినిమాలో బిజీగా ఉన్నాడు. రొమాంటిక లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈమూవీని తొలి ప్రేమ మూవీ దర్శకుడు వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈటీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
ఈసినిమా జనవరి లో విడుదల కానుంది. అయితే అఖిల్ తన తర్వాత సినిమా గురించి ఎటువంటి క్లారిటీ లేదు. దీంతో అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు దర్శకుడు శ్రీను వైట్ల. నాగార్జునకు శ్రీనువైట్లకు మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కింగ్ మూవీ నాగ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు .
ఈమూవీతోనే నాగార్జునకు కింగ్ అనే బిరుదు వచ్చింది. శ్రీను వైట్లకు గత కొంత కాలంగా ఒక్క హిట్ కూడా లేకపోవడంతో అఖిల్ తో మూవీకి నాగార్జున ఒప్పుకోలేదంట. అఖిల్ కు కూడా ఇప్పటి వరకూ సరైన హీట్ లేకపోవడంతో ప్రమోగాలు చేయడం వద్దని ఫిక్స్ అయ్యాడట నాగార్జున.