నానికి విల‌న్ గా మారిన హీరో సిద్ధార్ద్..

239
nani siddarth
- Advertisement -

బొమ్మ‌రిల్లు సినిమాతో త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్ధార్ద్. ఆ సినిమాలో ఆయ‌న న‌ట‌న‌తో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత ఆయ‌న చేసిన సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో ఎక్క‌వగా ఆఫ‌ర్లు రావ‌డం లేదు. సిద్ధార్ద్ ప్ర‌స్తుతం త‌మిళ్ లో కొన్ని సినిమాలు చేస్తున్నారు.

nani

తాజాగా వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం ఆయ‌న విల‌న్ పాత్ర‌లో కనిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. న్యాచుర‌ల్ స్టార్ నాని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ మూవీ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే నానికి సంబంధించిన ఫోటో షూట్ ను కూడా పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్ధ వారు ఈమూవీని నిర్మించ‌నున్నారు.

nani vikram

వ‌చ్చే సంవ‌త్స‌రం నుంచి ఈప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తుంది. వ్య‌క్తిగ‌తంగా నాని, సిధ్దార్ద్ మంచి స్నేహితుల‌న్న విష‌యం తెలిసిందే. అయితే తెర‌పై వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి మ‌రి. ప్ర‌స్తుతం నాని జెర్సీ మూవీలో బిజీగా ఉన్నాడు. ఈసినిమా ఏప్రిల్ 19న విడుద‌ల కానుంది.

- Advertisement -