అల్లు అర్జున్ చెల్లెను పెళ్లి చేసుకోనున్న అక్కినేని హీరో

294
Allu Arjun Sushanth
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈమూవీలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా…నివేధా పేతురాజ్ ప్రత్యేక పాత్రలో నటించనుంది.

అయితే ఈసినిమాలో యువ హీరోలు సుమంత్ అక్కినేని, నవదీప్ లు కీలక పాత్రలో నటించనున్నారు. సుశాంత్ కు సంబంధించిన పాత్రపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ సుశాంత్ ఇద్దరు బావ బామ్మర్దులుగా కనిపించనున్నారని సమాచారం.

బన్నీ హీరోయిన్ పూజా హెగ్డేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. పూజా హెగ్డే సుశాంత్ చెల్లెలు. అలానే, అల్లు అర్జున్ సోదరిగా నటిస్తున్న నివేదను సుశాంత్ ప్రేమిస్తాడు. పెద్దల సమక్షంలో ఈ నలుగురి వివాహం జరుగుతుందట. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనినిబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో ఆసక్తికర కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అర్థం అవుతోంది. అల్లు అరవింద్, రాథాకృష్ణ నిర్మిస్తున్న ఈచిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

- Advertisement -