విజయ్ దేవరకొండ ‘రౌడి’ బ్రాండ్ లోకి రష్మీక

835
Vijay Devarakonda Rashmika.jpeg
- Advertisement -

రౌడి హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. హీరోగానే కాకుండా ఇటివలే నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టాడు. కింగ్ ఆఫ్ హిల్ అనే ప్రొడక్షన్ ను ప్రారంభించాడు. తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం చేస్తూ విజయ్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇక విజయ్ ప్రారంభించిన రౌడి బ్రాండ్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మార్కెట్లో ఈ బట్టలకు చాలా మంచి ఆదరణ లభిస్తోంది.

Rowdy brand

తక్కువ ధరతో వెరైటీగా ఉండటంతో వీటిపై యూత్ మక్కువ చూపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రౌడి బ్రాండ్ లో కేవలం అబ్బాయిలకు మాత్రమే దొరికేవి. కానీ ఇప్పటి నుంచి అమ్మాయిల డ్రెస్ లను కూడా అమ్మాలని నిర్ణయించారట. లేడి బ్రాండ్ కు రష్మీక మందనను పార్ట్ నర్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట.

ఈఇద్దరు కలిసి త్వరలోనే బిజినెస్ ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమా వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు మరోసారి డియర్ కామ్రేడ్ లో వీరిద్దరు కలిసి నటించారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. డియర్ కామ్రేడ్ మూవీ ఈనెల 26న తెలుగు,తమిల్ , కన్నడలో విడుదల అవుతుంది.

- Advertisement -