ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. ఈ ఆఫర్ లో భాగంగా 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్న ఎయిర్‌టెల్ వినియోగదారులు 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్ గ్రేడ్ అయితే 30 జీబీ డేటాను ఉచితంగా పొందుతారు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులైతే రోజుకి 1జీబీ చొప్పున 30 రోజులకు 30 జీబీ రానుండగా, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఒకేసారి 30 జీబీ డేటా ఉచితంగా వస్తుంది.
ఈ ఆఫర్‌కు మీరు అర్హులా కాదా తెలుసుకోవడానికి మీ ఎయిర్‌టెల్ నంబర్ నుంచి 51111కు కాల్ చేయండి లేదా మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అర్హులైన కస్టమర్లకు 24 గంటల్లోపు ఫ్రీడేటాను యాక్టివేట్ చేస్తారు. గతంలో ఇదే మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ ఆఫర్ కింద లెనోవో, సెల్కాన్, నోకియా, ఇంటెక్స్, సామ్‌సంగ్ మొబైల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని కస్టమర్లకు రూ.2 వేల వరకు క్యాష్‌బ్యాక్ అందించింది.