ఎంఐఎంలో 30శాతం టికెట్లు హిందువులకే

423
owisi
- Advertisement -

ఏంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏంఐఏం అంటే కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈముద్రను చెరిపేయాలని నిర్ణయించుకున్నారు ఓవైసీ. త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 30శాతం టికెట్లు హిందువులకు కేటాయించారు. ఇందులో భాగంగా- రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు, ప్రముఖ సంఘ సేవకుడు ప్రకాశ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన వంచిత్ బహుజన్ అఘాడి ( వీబీఏ) పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా మజ్లిస్ తరఫున ఈ సారి ఏకంగా 30 శాతం మంది హిందూ అభ్యర్థులకు టికెట్లను ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో మజ్లిస్ మొత్తం 44 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. దీనికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేసిన అసెంబ్లీ స్థానాలు 24 మాత్రమే. ఈ సారి ఈ సంఖ్యను 44కు పెంచింది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 44 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది.

- Advertisement -