మోదీని కలిసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

286
Tamilisai Modi

ప్రధాని నరేంద్రమోదీని కలిశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఆమె సాయంత్రం మోడీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో గవర్నర్ రాష్ట్రంలో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం గురించి ప్రధానికి తెలియజేశారు.

ప్లాస్టిక్ నిషేధం, యోగా తరగతులు నిర్వహించడం, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరం, రాజ్‌భవన్‌లో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై భారత ప్రధానికి నివేదిక సమర్పించినట్లు గవర్నర్ తెలిపారు. రాజ్‌భవన్‌లో ఐదు రోజులుగా ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగపై ఇటీవల ప్రచురించిన ప్రచురణను కూడా గవర్నర్ ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు

Modi Tamilisai