- Advertisement -
దేశంలో పెట్రోల్ ధర పెంపు షురూ అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పెట్రోల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.10, డీజిల్ ధర రూ.95.49గా ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరగడంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.80, డీజిల్ రూ.96.83గా నమోదైంది.
- Advertisement -