టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై బాగా పాపులర్ అయ్యింది నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసిన పోరాటానికి కొంత మంది మద్దతు ఇచ్చినా..మరికొంత మంది వ్యతిరేకించారు. కొద్ది రోజులు టాలీవుడ్ లో శ్రీరెడ్డి పేరు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులపై కామెంట్లు చేస్తూ రోజు వార్తల్లో నిలిచేది. పలువురు దర్శుకులు, నిర్మాతలు, హీరోలపై ఆమె బహిరంగంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
కొద్ది రోజులుగా ఆమె సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్, నాగబాబు పై సంచలన కామెంట్లు చేస్తున్నారు. పవన్ అభిమానులు కూడా ఆమెకు అదే రేంజ్ లో ఆడుకుంటున్నారు. తాజాగా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా జోరుగా చర్చ జరుగుతుంది. శ్రీరెడ్డి కనుక వైసిపిలో చేరితే రోజా తర్వాత మరో ఫైర్ బ్రాండ్ నేతగా నిలవనుందనుకోవచ్చు.. ఇటివలే జరిగిన ఎన్నికల్లో ఆమె జగన్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైసిపికి మద్దతుగా ఆమె ప్రచారం చేసింది.
తాజాగా ఆమె చేతిపై గోరింటాకుతో జగన్ అని పేరును కూడా రాసుకుంది. త్వరలోనే ఆమె వైసిపిలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కులంపై అభిమానంతోనే శ్రీరెడ్డి జగన్ పేరు రాసుకుందని మరికొందరు అంటున్నారు. శ్రీరెడ్డి కోరితే, ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక ఆమెను వైసీపీలోకి తీసుకుంటే మరో రోజా అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.