ఇచ్చిన ప్రతిహామీ జగన్ నెరవేర్చారా..మరి వాటి సంగతేంటి?

30
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీ ప్రచారంలో దూకుడు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో కేవలం గెలుపు మాత్రమే కాకుండా 175 స్థానాల్లో సత్తా చాటలని చూస్తున్న జగన్. ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు తనదైన రీతిలో వ్యూహాలు రచిస్తున్నారు. తన పాలన సంక్షేమం అభివృద్ది దిశగా సాగిందని ఏ రకంగా చూసిన ఇతర ప్రభుత్వాలతో పోల్చితే తమ ప్రభుత్వం మెరుగ్గానే చెబుతున్నారు. అందుకే ప్రజల అండ వైసీపీకి ఉందని వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లోనే 98 శాతం హామీలను నెరవేర్చమని వేరే ఏ ప్రభుత్వం అలా చేయలేదని బల్లగుద్ది చెబుతున్నారు జగన్. .

తాజాగా విజయవాడలో నిర్వహించిన సభలో సి‌ఎం జగన్ మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్‌టి‌సి ని ప్రభుత్వంలో విలీనం చేసి చిత్తశుద్దిని నిరూపించుకుందని, పదవి విరమణ వయసును 60 నుంచి 62 పెంచిన గనత వైసీపీదేనని సి‌ఎం జగన్ చెప్పుకొచ్చారు. ఎంతో కాలంగా అమలుకు నోచుకోని ఓపిఎస్ సమస్యను పరిష్కరించి దాని స్థానంలో జి‌పి‌ఎస్ ( గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ ) ను ప్రవేశ పెట్టమని.. ఇలా గడిచిన ఈ నాలుగేళ్లలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని జగన్ చెబుతున్నారు. అయితే నిజంగానే జగన్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందా అంటే చాలమంది పెదవి విరుస్తున్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేదం అని ఎన్నికల ముందు ప్రకటించిన జగన్.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏడాదికో జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన హామీ ఊసే లేదంటున్నారు. ఇక అభివృద్ది విషయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతా మేలనేది కొందరి అభిప్రాయం. ఈ నాలుగేళ్లలో చెప్పుకోదగ్గా ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రనికి తీసుకురాలేదని, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసిన రోడ్ల దుస్థితి దారుణంగా ఉందని.. ఇలా జగన్ వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతున్నారు కొందరు రాజకీయ వాదులు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇవి కూడా హైలెట్ అయ్యే అవకాశం ఉంది. మరి వీటిని వైఎస్ జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Also Read:7గురు సిట్టింగ్‌ల మార్పు… BRS లిస్ట్ ఇదే

- Advertisement -