హీరోయిన్ తప్పటడుగు… ఫ్యామిలీ నాశనం

55
- Advertisement -

‘నేనే నిత్యం నేనే సత్యం, నేనే దేవుడ్ని అంటూ ఎందర్నో నమ్మించిన నిత్యానందకు ఎందరో అమాయకులు భక్తులయ్యారు. ఈ లిస్ట్ లో కొందరు హీరోయిన్లు కూడా ఉండటం ఆశ్చర్యకరం. సౌత్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తన రెండో కూతురు ‘రంజిత’ నిత్యానంద మాయలో పడి భర్తకు విడాకులు ఇచ్చిందని రంజిత తండ్రి, ప్రముఖ సీనియర్ నటుడు అశోక్ కుమార్ బాధ పడుతూ చెప్పారు. ఇదే సమయంలో తన పెద్ద కూతురు కూడా నిత్యానంద మాయలోనే పడి, భర్తకు విడాకులు ఇచ్చి నిత్యానంద దగ్గరికి వెళ్లిపోయిందని, ఇద్దరు కూతుళ్లు ఇలా చేయడంతో తన భార్య చనిపోయిందని ఓ ఇంటర్వ్యూలో రంజిత తండ్రి కుమిలిపోతూ చెప్పడం అందర్నీ కదిలించింది.

నిత్యానంద వల్ల తన కుటుంబం నాశనం అయ్యిందని రంజిత తండ్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో రంజితతో రాసలీల వ్యవహారంలో అడ్డంగా బుక్ అయ్యి, దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద. నిత్యానంద రాసలీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం అయినా.. ఇంకా నిత్యానందను నమ్మే భక్తులు పెరుగుతూ ఉండటం నమ్మశక్యం కానీ విషయం.

Also Read:బిచ్చగాడు 3… విజయ్ క్లారిటీ!

నిజానికి అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం ఆరోపణలతో నిత్యానంద పై ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. పైగా ఓ ఉన్నత అధికారి కూడా నిత్యానంద మాయలో పడి.. అతని రాసలీలలో భాగం అయింది. మొత్తమ్మీద నిత్యానంద వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. కానీ, నిత్యానంద మాత్రం ఈక్వెడార్ దగ్గరలోని ఒక దీవిని సొంతం చేసుకుని, దానికి కైలాస దేశమని పేరు పెట్టుకుని, అక్కడే దేవుడిగా చలామణి అవుతున్నాడు. కలియుగం అంటే ఇదేనేమో.

Also Read:హ్యాపీ బర్త్ డే..కార్తి

- Advertisement -