హ్యాపీ బర్త్ డే..కార్తి

31
- Advertisement -

విలక్షణమైన నటనతో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకుసాగుతున్న హీరో కార్తి. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇవాళ కార్తి బర్త్ డే సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

1977 మే 25న మద్రాస్‌లో జన్మించారు కార్తి. కార్తి తండ్రి శివకుమార్ నటుడే. కార్తి అన్న సూర్య. మంచి కంటెంట్ సినిమాలతో కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కార్తి. తొలి సినిమా పరుత్తివీరన్ తోనే ప్రేక్షకులను మెప్పించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేసిన యుగపురుషుడుతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని ‘ఎవర్రా మీరంతా..’అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది.

నాపేరు శివతో మంచి గుర్తింపు తెచ్చుకోగా 2019లో వచ్చిన ఖైదీ సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. తర్వాత సుల్తాన్‌తో ప్రేక్షకులను మరింత ఇంప్రెస్ చేశారు. 2004లో మణిరత్నం డైరెక్షన్‌లో సూర్య హీరోగా వచ్చిన యువ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. 2007లో పరుత్తివీరన్ సినిమాతో తెరంగేట్రం చేశాడు.

Also Read:TTD:అత్యాధునిక టెక్నాలజీతో భద్రతా

కార్తి నటించిన అయరతిల్ ఒరువాన్, పయ్యా, నాన్ మహాన్ అల్లా, సిరుతై, బిరియాని విజ‌యాలు సాధించ‌డంతో అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. త‌మిళ్ లో న‌టించిన కార్తీ చిత్రాలు యుగానికి ఒక్క‌డు, ఆవారా, నా పేరు శివ తెలుగులో రిలీజై ఘ‌న విజ‌యం సాధించాయి. కార్తి సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా అవసరం ఉన్నవారికి సాయం చేడం అలవాటు. అందుకే మక్కల్ నాల మండ్రం అనే సేవా సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. అలాగే ఫ్యాన్స్‌తో కలిసి రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కార్తీ మరిన్ని విజయాలు అందుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొనుకుంటోంది.

Also Read:ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం..

- Advertisement -