Nagma:నాకు ఓ తోడు కావాలి

47
- Advertisement -

నగ్మా.. బోల్డ్ నెస్ కి ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్. అందాల ఆరబోతలో, పెదవుల చుంబనంలో నగ్మా కి తిరుగు లేదన్నట్టు రెచ్చిపోయింది. ఏది ఏమైనా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌ గా ఒక వెలుగు వెలిగిన నగ్మా అంటే.. ఇప్పటికీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఐతే, పర్సనల్ లైఫ్ లో నగ్మా ఒంటరిగానే మిగిలిపోయింది. వయసు అయిపోతున్నా.. నగ్మా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఐతే, 48 సంవత్సరాల వయసులో తోడు కోసం ఆశగా ఎదురుచూస్తోందట. తన పెళ్లిపై నగ్మా తాజాగా స్పందించింది. ఇంతకీ నగ్మా తన ఒంటరితనం పై ఏం మాట్లాడింది అంటే..

నగ్మా మాటల్లోనే విందాం రండి. ‘నాకు నిజానికి పెళ్లి చేసుకోకూడదనే ఆలోచన లేదు. ఇప్పటికీ నాకు ఓ కుటుంబం ఉండాలనేది కోరిక. కాలం కలిసి వస్తే త్వరలో నా పెళ్లి జరుగుతుందేమో. ఇలా జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను. రాత్రుళ్ళు ఒంటరిగా పడుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిత్యం తోడు కోసం వెతుక్కోవడం చాలా కష్టం. వయసులో ఉన్నప్పుడు.. మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కానీ.. వయసు పెరిగే కొద్దీ ఆ బిగువు, తెగింపు ఉండవు. అప్పుడు మన కోసం వచ్చే వాళ్లు తగ్గిపోతారు. అప్పుడే మనకంటూ ఓ తోడు కావాలి అనిపిస్తోంది’ అంటూ నగ్మా చెప్పుకొచ్చింది.

Also Read:ప్రతిరోజు నడకతో ఆరోగ్యం!

నగ్మా ఇంకా మాట్లాడుతూ.. ‘కోరికలతో దగ్గరయ్యే వారంతా మనతోనే ఉండరు. కానీ ప్రేమతో లేదా పెళ్లి అనే బంధంతో మనకు దగ్గరయ్యే వారు చివరి వరకూ మనతోనే ఉంటారు. అందుకే.. నాకు ఈ మధ్య పెళ్లి చేసుకోవాలనే కోరిక ఎక్కువ అయ్యింది’ అని నగ్మా ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. కాగా, నగ్మా గతంలో పెళ్లైన నలుగురిని ప్రేమించిందనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. 2008లో నటనకు గుడ్‌బై చెప్పేసి రాజకీయాల్లో ప్రవేశించింది. కానీ ఆశించిన స్థాయిలో నగ్మా రాజకీయాల్లో రాణించలేకపోయింది.

Also Read:షోలాపూర్‌కు మంత్రి హరీష్‌ రావు

- Advertisement -