బాలీవుడ్‌లో మరో విషాదం..

21
leena

బాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. హిందీ చిత్రసీమ మరో నటిని కోల్పోయింది. సినిమాలు, టీవీ కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న లీనా ఆచార్య(30) మరణించారు. లీనా గత రెండేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. లీనా ఆచార్య చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోవడం పట్ల సినీ, టీవీ సహనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

లీనా నటనపై మక్కువతో మోడలింగ్ నుంచి వినోదరంగంలో ప్రవేశించారు. ఈమె చివరగా ‘క్లాస్ ఆఫ్ 2020’ అనే వెబ్ సిరీస్‌లో నటించించారు. ‘సేట్‌జీ’, ‘ఆప్ కే ఆ జానే సే’ మరియ ‘మేరీ హానీ కారక్ బీవీ’ వంటి సీరియల్స్ లీనాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘హిచ్కీ’ అనే చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.