బీజేపీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్నా:ఓవైసీ

23
asad

జేపీ నేత‌ల‌ను నిద్ర‌లో లేపి కొన్ని పేర్లు చెప్ప‌మంటే వాళ్లు చెప్పే పేర్ల‌లో ఓవైసీ అనే పేరు క‌చ్చితంగా ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు మజ్లిస్ నేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లం అయినా ఈ మ‌హాన‌గ‌ర ప్ర‌జ‌ల‌కు నరేంద్ర‌మోదీ స‌ర్కారు చేసిన ఆర్థిక సాయం ఏమి లేద‌ని విమ‌ర్శించారు.

బీజేపీ ఎత్తులు హైద‌రాబాద్‌లో పార‌వ‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌లకు ఎవ‌రేంటో అంతా తెలుస‌ని అస‌దుద్దీన్ పేర్కొన్నారు. బీత‌న పేరుతోపాటు ద్రోహం, ఉగ్ర‌వాదం, పాకిస్థాన్ అనే ప‌దాలను బీజేపీ నేత‌లు ఎక్కువ‌గా ఉచ్ఛ‌రిస్తార‌ని చెప్పారు. 2019 త‌ర్వాత తెలంగాణ‌కుగానీ, ప్ర‌త్యేకించి హైద‌రాబాద్‌కు గానీ కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చేందేమీ లేని మండిప‌డ్డారు ఓవైసీ.

హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌కు వాళ్లు ఏం సాయం చేశారో చెప్పాల‌ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు వాళ్లు ఏ సాయం చేయ‌లేదు కాబ‌ట్టే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌తం పేరుతో ఓట్లు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.