వారి బండారం బయటపెట్టేస్తా

960
- Advertisement -

ఇటీవల యశోద సినిమాలో ఓ మంచి పాత్రతో పలకరించిన నటి కల్పిక గణేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ తమిళ సినిమా అవార్డుల ఫంక్షన్‌కు వెళ్లిన ఆమె ‘నన్నెవరూ ఈ ఫంక్షన్‌కు పిలవలేదు. కానీ ఇండస్ట్రీ నా ఇల్లు అనుకుని వచ్చేసా’అంటూ మాట్లాడింది. ట్రోల్స్‌ను తాను పట్టించుకోనని.. త్వరలో ధనుష్‌, ధన్య బాలకృష్ణ, అనిరుధ్‌, బాలాజీ మోహన్‌.. ఇలా కొందరి అసలు విషయాలు బయటపెడతానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. మరి కల్పిక గణేశ్‌ ఏ విషయాలు బయట పెడుతుంది ?, ఎలాంటి విషయాలు ఆమె చెప్పబోతుంది ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నటి కల్పిక గణేష్ లుంబర్ రాడిక్యులోపతి అనే వ్యాధితో బాధ పడుతుంది. కొన్నిరోజుల క్రితం కల్పిక ఈ రాడిక్యులర్ పెయిన్ కి సంబంధించి సర్జరీ కూడా చేయించుకుంది. ఆమెకు సర్జరీ సవ్యంగా జరిగింది. అయితే, పర్సనల్ గా కల్పిక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంది అంటూ ఆమె గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కల్పిక గణేష్.. ధనుష్‌, ధన్య బాలకృష్ణ, అనిరుధ్‌ లకు సంబంధించి అసలు విషయాలు చెబుతా అని కామెంట్స్ చేసిందని, ఆమెను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కల్పిక సన్నిహితులే క్లారిటీ ఇస్తున్నారు.

 ఇవి కూడా చదవండి..

- Advertisement -