ఎన్టీఆర్ సినిమా చాలా వెనక్కి?

522
- Advertisement -

2023 అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా అని ఇప్పటి వరకు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కొరటాల సినమా ఆగస్టు లోపు ఫినిష్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్. అందువల్ల మధ్యలో దొరికే 3 నెలల గ్యాప్ సరిపోతుంది అని ఎన్టీఆర్ అంచనా. పైగా ప్రశాంత్ నీల్ కూడా సలార్ ను సమ్మర్ లోపే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. అయినా ప్రశాంత్ నీల్ కి సమయం సరిపోతుందా? డౌటే. సహజంగానే ప్రశాంత్ సినిమా ప్రారంభించడానికి, సెట్ మీదకు వెళ్లడానికి కూడా చాలా టైమ్ తీసుకుంటారు.

హీరో ప్రిపరేషన్, మేకోవర్, డిస్కషన్లు, ప్రీ ప్రొడక్షన్ అన్నది చాలా డిటైలింగ్ గా వుంటుంది ప్రశాంత్ నీల్ దగ్గర. పైగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో కూడా ఇన్ వాల్వ్ అవుతాడు. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ పై మంచి పట్టు ఉంటుంది. అందుకే.. గత ఆరు సినిమాల నుంచి తారక్ కి ఒక్క ప్లాప్ కూడా లేదు. అందువల్ల స్క్రిప్ట్ కు ఎక్కువ టైమ్ కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితి ని బట్టి చూస్తుంటే వచ్చే ఏడాది అక్టోబర్ లో సినిమా స్టార్ట్ చేయటం కష్టమే.

అక్టోబర్ కాదు కదా, 2024 మార్చి-ఏప్రిల్ కు కూడా ప్రశాంత్ నీల్ రెడీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని క్రాఫ్ట్ లతో సమావేశాలు, డిస్కషన్లు వంటి పనులు ప్రశాంత్ నీల్ దగ్గర బాగా స్లోగా జరుగుతాయి. పైగా అన్నింటికి మించి కీలకమైన యాక్షన్ సీన్స్ కోసం భారీ సెట్స్ వేయాలి. కాబట్టి.. ఏ యాంగిల్ లో చూసుకున్నా.. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా బాగా ఆలస్యం కానుంది. 2024 సమ్మర్ తర్వాత స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -