2022 సూపర్ హిట్ సాంగ్స్ ఇవే!

1161
- Advertisement -

2022..టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలు – మరిన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. అయితే హిట్ – ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా ఆయా మూవీల్లోని సాంగ్స్‌ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. 2022 లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటి సీతా రామం. ఈ సినిమాలో ఓ సీతా సాంగ్ తో పాటు ఇంతందం సాంగ్ కూడా మోస్ట్ పాపులర్ అనిపించుకున్నాయి.

అనిరుద్ నుండి ఈ ఇయర్ వచ్చిన బెస్ట్ సాంగ్స్ లో హలమిత్తి హబిబో సాంగ్ ఫస్ట్ ప్లేస్ అందుకుంది. ఆల్మోస్ట్ ఈ ఇయర్ జరిగిన అన్ని ఈవెంట్స్ లో ఈ సాంగ్ వినిపించింది. అలాగే ఓరి దేవుడా సినిమాలోని గుండెల్లోనా సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మాచెర్ల నియోజక వర్గంలో రారా రెడ్డి సాంగ్ మోస్ట్ ఫేవరేట్ మాస్ సాంగ్ గా నిలిచింది.

గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి , సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ కూడా ఈ ఇయర్ పాపులర్ సాంగ్స్ లో చోటు దక్కించుకుంది.లైగర్ ఆల్బం లో ఫస్ట్ సింగిల్ గా రిలీజైన అక్డి పకడీ సాంగ్ కూడా ఈ ఇయర్ బెస్ట్ సాంగ్ అనిపించుకుంది. 18 పేజిస్ ఆల్బం ద్వారా మంచి ఎనర్జీ సాంగ్ అందించాడు. శింబు పాడిన టైం ఇవ్వు పిల్ల సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంక్రాంతి సీజన్ లో వచ్చిన బంగార్రాజు సినిమాలో బంగారా బుల్లెట్ ఎక్కి వచ్చేయ్రా సాంగ్ ఆ నెలలో మోస్ట్ పాపులర్ అనిపించుకుంది. రౌడీ బాయ్స్ సినిమాలో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే సాంగ్ హైలైట్ అయింది. డీజే టిల్లు టైటిల్ సాంగ్ 160 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే రారా రక్కమ్మ బెస్ట్ సాంగ్ అనిపించుకుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -