ఓ వైపు టాలీవుడ్ లో, మరోవైపు కోలీవుడ్ లో తన అందంతో పాటు పెర్ఫార్మెన్స్ తో కూడా యూత్ ని ఫిదా చేసిన హీరోయిన్ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అంజలి.
కాని ఈ అమ్మడు తెలుగు లోకన్నా తమిళనాట నటిగా బాగా పాపులర్ అయ్యింది. అక్కడే సినిమా ఆఫర్స్ ఎక్కువగా వచ్చిపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా తమిళ హీరో జై పై ఉన్న తన ప్రేమ వ్యవహారంతో కూడా బాగానే పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. వీరిద్దరూ… రీల్ లైఫ్ లో నటించినట్టే రియల్ లైఫ్ లో కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అంజలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోందంటూ వస్తున్న వార్తలు అందరిని షాక్ కు గురి చేస్తుంది. రాజకీయాలకు, చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా తమిళ రాజకీయాలు సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. వీరి రాజకీయ రంగప్రవేశం త్వరలోనే ఉంటుందని వారి అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మన సీనియర్ కథానాయికల రాజకీయం తక్కువేం కాదు.
ఇక అంజలి ఈ మధ్య దేశ రాజధానిలో ఉన్న పార్లమెంట్ ను విజిట్ చేసి వచ్చింది. ఎవరిని కలవడానికి వెళ్లింది? ఎందుకు వెళ్లింది? అనేది మాత్రం స్పష్టత లేకపోయినా ఓ పార్టీ అధినేతతో మంతనాలు జరిపినట్లు టాక్. దీనితో మీడియా అంతా ఆమె రాజకీయ రంగప్రవేశంపై దృష్టిపెట్టింది.
అయితే ఇటీవలే అంజలి ఓ మీడియా ఇంటర్వ్యూలో తనకు రాజకీయాలంటే చాలా ఆసక్తి అని, తాను వాటిని క్రమం తప్పకుండా ఫాలో అవుతాను అని చెప్పింది. దాంతో అంజలి ఏదో ప్రాంతీయ పోలిటికల్ పార్టీలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజంమెంతోగానీ అంజలి నోరు విప్పితేనే ఈ వార్తలకు పుల్ స్టాప్ పడేలా కనిపిస్తోంది.