జయప్రద మోసానికి కారణం అదే

39
- Advertisement -

జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ సినీ నటి జయప్రద దాఖలు చేసిన అప్పీలును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. 15 రోజుల్లో కోర్టుల్లో లొంగిపోయి రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. చెన్నైలో గతంలో జయప్రద ఓ సినిమా థియేటర్ నడిపారు. అందులో సిబ్బందికి ఈఎస్ఐ చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారన్న కేసులో ధర్మాసనం జయప్రదకు శిక్ష విధించింది. ఈ క్రమంలో శిక్షను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, జయప్రద ప్రవర్తన పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సీనియర్ హీరోయిన్ గా జయప్రదకు నేటికీ ఇండస్ట్రీలో గౌరవం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె పై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, జయప్రద మోసం చేయడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు అని తెలుస్తోంది. ప్రస్తుతం జయప్రద గారి పరిస్థితి చూస్తే అవకాశాలు తక్కువ, అప్పులు ఎక్కువగా ఉంది. ఐతే క్యారెక్టర్ నటిగా కూడా ఆమెకు మంచి పేరు ఉంది. అయినా, జయప్రద మాత్రం ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. దీనికితోడు రాజకీయాల్లో కూడా ఆమె కొంత డబ్బు పోగొట్టుకుంది.

దాంతో ఆమె ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. పైగా జయప్రధ నిర్మాతగా అప్పట్లో కొన్ని సినిమాలు చేసింది. అప్పుడు ఆస్తులు పోగొట్టుకుంది. ఆ తర్వాత నటిగా కూడా క్యాష్ చేసుకోలేకపోయారు. మొత్తానికి ప్రస్తుతం జయప్రద గారు కష్టకాలంలో ఉన్నారు. సుమారు పదిహేను కోట్లకు పైగా ఆమెకు అప్పులు వున్నాయట. ఇంతకీ జైలు శిక్ష నుంచి జయప్రద ఎలా తప్పించుకుంటుందో చూడాలి.

Also Read:గులాబీతో..ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -