నటనకు గుడ్ బై అంటున్న చైతూ..

251
- Advertisement -

అవును.. నాగచైతన్య ఇప్పుడు దర్శకుడిగా మారమబోతున్నాడు. త్వరలో మెగాఫోన్‌ పట్టుకోవడానికి చైతూ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చేశారు. అయితే… చైతూ దర్శకత్వం వహించబోతున్నది సినిమాలకు కాదు, యాడ్‌ ఫిల్మ్స్‌కి.

అది కూడా రియల్‌ లైఫ్‌లో కాదు, రీల్‌ లైఫ్‌లోనట. చందూ మొండేటి దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలో నాగచైతన్య యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌గా కనిపిస్తారట.

nagachaitanya as a aad director in chandu mondeti film

ఇప్పటికే ఏం మాయ చేశావే సినిమాలో సినిమా దర్శకుడిగా నటించి మెప్పించిన చైతూ ఈ సినిమాతో మళ్ళీ దర్శకుడిగా కనిపించనున్నాడు. ఇక సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో చైతూ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్‌ చాలా కొత్తగా ఉంటాయట! ఆల్మోస్ట్‌ ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందనీ, త్వరలో షూటింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని యూనిట్‌ సన్నిహిత వర్గాల సమాచారం.

మొత్తానికి ఈ సినిమాలో నటనకు గుడ్ బై చెప్తూనే… తన క్యారెక్టర్‌ కోసం డైరెక్షన్‌ చేయడానికి చైతూ రెడీ అవుతున్నాడన్న మాట.

- Advertisement -