మిస్టర్ పర్ఫెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘దంగల్’. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ హర్యానా రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత విశేషాలతో తెరకెక్కింది. ‘దంగల్’ సినిమా బాలీవుడ్‌లో 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాకు ఆమిర్ సుమారు రూ.175 కోట్లు తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
‘డీఎన్ఏ’ పత్రిక ప్రకారం.. దంగల్ తో ఆమిర్ కు రూ.175 కోట్ల రూపాయలు లభించాయి. పారితోషకంతో, వసూళ్లలో వాటాతో ఆమీర్ కు ఈ మొత్తం దక్కింది. అయితే.. ఈ హీరో కు వచ్చే సొమ్ము అంతటితో ఆగిపోలేదు. డిస్నీ యూటీవీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆమిర్ సినిమా చిత్రీకరణకు ముందు అడ్వాన్స్‌గా రూ.35 కోట్లు తీసుకున్నాడు. దీనితో పాటు ఒప్పందంలో భాగంగా 33 శాతం వాటా, శాటిలైట్ రైట్స్, సినిమా విడుదలయ్యాక వచ్చే కలెక్షన్స్‌లో మరో 33 శాతం వాటా తీసుకున్నట్లు సమాచారం.
ఇలా ప్రతి సినిమాకు ఆమిర్ రూ.100 కోట్లకుపైగానే పారితోషికం తీసుకుంటూ బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆమిర్ ప్రస్తుతం సీక్రెట్ సూపర్‌స్టార్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌లో నటిస్తున్నాడు. ఈ పారితోషకం విషయంలో తన సహచర బాలీవుడ్ హీరోలతో సమానం ఉన్నాడు ఆమిర్. అయితే.. ఈ హీరో కు వచ్చే సొమ్ము అంతటితో ఆగిపోలేదు.