హృతిక్‌ నోట….ఏంటీ మాట..?

324
Hrithik Roshan wants Katrina Kaif in his next film
- Advertisement -

సినిమా హిట్‌ అయిందంటే చాలు..ఆ సక్సెస్‌ తో పాటు ఆ సినిమాలో ఎవరోఒకరికి అదృష్ట లక్ష్మి అనో, గోల్డెన్‌ లెగ్‌ అనో పేర్లు పడిపోతాయి.  ఇలా టాలీవుడ్‌ లోనే కాదు, బాలీవుడ్‌లో కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఇదే పరిస్థితి హృతిక్‌ మూవీకి వచ్చింది. ఎన్నో హిట్‌ సినిమాలలో నటించిన హృతిక్‌ రోషన్‌ హీరోయిన్‌ల విషయంలో అంతగా సెంటిమెంట్‌లను పట్టించుకోడు.
Hrithik Roshan wants Katrina Kaif in his next film
ఐరన్‌ లెగ్‌లని పేరు మోసిన భామలకు కూడా తన సినిమాలలో అవకాశం ఇచ్చి, వారి కెరీర్‌కు ఏదో విధంగా హెల్ప్‌ అవుతుంటాడు. అలాంటిది తన నెక్ట్స్‌  సినిమా కోసం ఇప్పుడు ఓ హీరోయిన్‌ కావాలని పట్టుబడుతున్నాడట . అంతేకాదు  అలా అయితేనే ఆ సినిమాలో నటిస్తానని, ఖరాఖండిగా చెప్పేస్తున్నాడట. ఇంతకు హృతిక్‌ కోరుకుంటున్న  ఆ హీరోయిన్‌ ఎవరో కాదు బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌.

ఇప్పుడు  ఈ భామ  పేరే హృతిక్‌ పదే పదే తలుస్తున్నాడట.  వరుస హిట్లను కొట్టి బాలీవుడ్‌లో టాప్‌ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న  కబీర్‌ఖాన్‌ ప్రస్తుతం సల్మాన్‌ హీరోగా ‘ట్యూబ్‌లైట్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తరువాత హృతిక్‌ రోషన్‌తో  కబీర్‌ ఓ మూవీ తీయాలనుకుంటున్నాడట. అందుకోసం అతడికి ఓ స్టోరీని కూడా వినిపంచాడట.
 Hrithik Roshan wants Katrina Kaif in his next film
అయితే ఆ కథకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన హృతిక్‌, హీరోయిన్‌గా మాత్రం కత్రినాను పెట్టుకోవాలని అన్నాడట. అలా అయితేనే ఈ సినిమాను చేస్తానని చెప్పాడట. హృతిక్‌ వర్షన్‌ ఇలా ఉంటే.. తాను అనుకున్న సినిమాలో  హీరోయిన్‌ పాత్రకు ఆమె సెట్‌ అవ్వదని కబీర్‌ భావిస్తున్నాడంట.

దీంతో ఈ ఇద్దరు ఇప్పుడు డైలామాలో ఉన్నట్లు తెలుస్తుంది.  అయితే ఇంతవరకూ  ఇలా అడగని హృతిక్‌ కత్రీనానే ఎందుకు  కావాలనుకుంటున్నాడని బాలీవుడ్‌ జనాల్లో  గుసగుసలు  మొదలయ్యాయి. ఏదేమైనా..ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి.

- Advertisement -