అమీర్ ఖాన్ ‘దంగల్’ వీడియో సాంగ్‌ వైరల్‌..

357
danal
- Advertisement -

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా దంగల్. లెజండ‌రీ రెజ్ల‌ర్ మ‌హావీర్ సింగ్ ఫోగ‌ట్ జీవిత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకుల్లో మరింత క్యూరియసిటీ పెరిగిపోయింది. ఇటు తెలుగులో కూడా యుద్ధం పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌తో సినిమాగా భారీ అంచనాలు పెంచగా..తాజాగా మరో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

గిలేహ్రియాన్ అంటూ సాగే ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా, ప్రీతమ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. టీనేజ్ సమయంలో లో గీతా ఫోగట్ రెజ్లింగ్ శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఆమె జర్నీ ఎలా సాగిందనే దానిని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా చూపించారు.

అమీర్ ఖాన్, సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, జైరా వసీమ్, సుహానీ బట్నాగర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. త‌న ఇద్ద‌రు కూతుళ్ల క‌ల‌లు సాకారం చేయ‌డానికి పోరాడే తండ్రి నేపధ్యంలో తెరకెక్కిన దంగల్ చిత్రం అభిమానులను ఏ రేంజ్ లో అలరిస్తోందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈ సినిమాలో అమీర్ రెండు డిఫరెంట్ పాత్రలను పోషించాడు. ఇటు వయసు మళ్లీన తండ్రి పాత్రలో.. అంటు రెజ్లర్‌గా కండల తిరిగిన దేహాంతో కన్పించబోతున్నాడు.

- Advertisement -