కీర్తి సురేష్‌పై కన్నేసిన ఆ హీరోలు….

262
Keerthy Suresh ACT IN THREE TOP HEROS

టాలీవుడ్‌లో ఇప్పుడు మారుమోగుతున్న హీరోయిన్‌ పేరు కీర్తి సురేష్,… వరుసగా సినిమా ఆఫర్లతో ,..సినిమా సక్సెస్‌లతో ఈ అమ్మడు దూసుకెళ్తుంది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో ఏ హీరోయిన్లకు రాని అవకాశాలు ఈ ముద్దుగుమ్మను వెతుక్కుంటూ వస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచమైన కీర్తి సురేష్ ప్రస్తుతం టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా మారింది. 2015లో కిషోర్ తిరుమల తెరకెక్కించిన నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది కీర్తి.

Keerthy Suresh ACT IN THREE TOP HEROS

ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్ సినిమాలో కీర్తి బీజిగా ఉంది. నేను లోకల్‌ మూవీ తరువాత మహేష్‌బాబు,పవన్‌కళ్యాన్‌, అల్లుఅర్జున్‌లతో సినిమాలకు ఓకె చెప్పిందట ఈ మలయాళ బ్యూటీ. అదే సమయంలో తమిళ నాట క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది ఈ అమ్మడు. ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భైరవ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కీర్తి ,… ఆ తరువాత వరుసగా సూర్య, కార్తీల సరసన సినిమాల్లో నటించెందుకు అంగీకరించదట కీర్తి సురేష్‌.

Keerthy Suresh ACT IN THREE TOP HEROS

ఈ సినిమాల అన్నింటితో టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ల లిస్ట్‌లో కీర్తి చేరటం ఖాయం అన్ని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు కీర్తి సురేష్‌ టాలీవుడ్‌ ఎంట్రీ తరువాత ప్రస్తుత అగ్రహీరోయిన్ల డిమాండ్‌ కూడా తగ్గుతుందట. ఇటీవలె కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన రెమో మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇతర హీరోయిన్లు గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే కీర్తి సురేష్ మాత్రం ఎక్కడా హద్దులు దాటకుండానే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్ క్రేజ్ అందుకున్న కీర్తి రానున్న రోజుల్లో టాలీవుడ్‌లో మరింత క్రేజ్ దక్కించుకోవడం ఖాయంమని ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.