మహేష్ ఇంట సంబరాలు మొదలైపోయాయ్..

153
Mahesh Babu family celebrate Christmas
Mahesh Babu family celebrate Christmas

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు చిన్నారి సితార ఇపుడు సోషల్ మీడియా స్టార్‌గా మారుతోంది. మహేష్‌ బాబుకున్న క్రేజ్‌ సితారకు ఉందనడంలో సందేహం లేదు. ఇక మహేష్‌ వైఫ్ నమ్రత గౌతమ్‌,సితారలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేరు చేస్తూనే ఉంది.

తాజాగా మహేష్ ఇంట క్రిస్మస్ సంబరాలు అప్పుడే స్టార్ట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. తన ఇద్దరు పిల్లలు గౌతమ్.. సితారలు ఒకేరకమైన క్రిస్మస్ కళ్లజోడు పెట్టుకున్న ఫోటోను నమ్రత పోస్ట్ చేసింది. అన్నాచెల్లెళ్లిద్దరూ ఒకే రకమైన కళ్లజోడుతో.. ఒకే రకమైన నవ్వులతో భలే ముద్దు ముద్దుగా ఉన్నారు. క్రిస్మస్ కి ఇంకా నాలుగువారాల సమయం ఉన్నా.. ‘ సంబరాలు మొదలైపోయాయ్’ అంటూ నమ్రత చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.

Christmass-Celebrations-in-Mahesh-Babu-House-1480484547-1940

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుపుకుంటుంది. వచ్చే నెల 23 వరకు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో, పుణెల్లో కీలక సన్నివేశాలతోపాటు, కొన్ని యాక్షన్‌ ఘట్టాల్ని చిత్రీరిస్తారు. ఆ తరువాత మహేష్‌ తన ఫ్యామిలీతో కలిసి యూకేకు వెళ్లనున్నాడట. గతేడాదిలాగే ఈ సారి కూడా క్రిస్ట్‌మస్‌, న్యూఈయర్‌ను యూకేలోనే జరుపుకోనున్నాడని సమాచారం.