ఆగస్టు 10న ‘ఆమెకోరిక’ తీరనుంది..!

265
- Advertisement -

ఎస్‌.ఆర్‌.మీడియా సమర్పణలో యూట్యూబ్‌ స్పైసీ స్టార్‌ స్వాతినాయుడు నటించిన చిత్రం ‘ఆమెకోరిక’. వల్లభనేని సురేష్‌ చౌదరి దర్శకత్వంలో చిక్కల సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌ సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ…‘‘ఆలు మగ అనుబంధంలోకి అనుకోని వ్యక్తి రావడంతో ఆ సంసారం ఎలా ఛిన్నాభిన్నం అయ్యిందన్న కాన్సెప్ట్‌తో ‘ఆమెకోరిక’ చిత్రం తెరకెక్కించాం.

Aame Korika Movie

ఈ చిత్రంలో లవ్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌, ఇలా ఆల్‌ ఎమోషన్స్‌ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగిన చిత్రం ఇది. టైటిల్‌కు జస్టిఫికేషన్‌ ఏంటో సినిమా చూసి తెల్సుకోవాల్సిందే. స్వాతినాయుడు నటన సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. సురేష్‌, రాజు, సిరిప్రియ, రాఘవరావ్‌ సపోర్టివ్‌ క్యారక్టర్స్‌లో అద్భుతంగా నటించారు. త్వరలో తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ చేయనున్నాం. ఆగస్టు 10న గ్రాండ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేస్తున్నాం’’ అని తెలిపారు.

Aame Korika Movie

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నివాస్‌ గోగులపాటి, కెమెరా:ప్రసాద్‌, సంగీతం: తలారి శ్రీనివాస్‌, నిర్మాతలు :చిక్కల సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌, కథ-మాటలు -స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వల్లభనేని సురేష్‌ చౌదరి.

- Advertisement -