‘ఆమె కోరిక’ను ఆదరిస్తున్నారు..!

187

ఎస్‌.ఆర్‌.మీడియా సమర్పణలో యూట్యూబ్‌ స్పైసీ స్టార్‌ స్వాతినాయుడు నటించిన చిత్రం ‘ఆమెకోరిక’. వల్లభనేని సురేష్‌ చౌదరి దర్శకత్వంలో చిక్కల సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైంది.

Aamekorika Movie Success Meet

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ…‘‘ఆలు మగల అనుబంధంలోకి అనుకోని వ్యక్తి రావడంతో ఆ సంసారం ఎలా ఛిన్నాభిన్నం అయ్యిందన్న కాన్సెప్ట్‌తో ‘ఆమెకోరిక’ చిత్రాన్ని తెరకెక్కించాం. విడుదలైన అన్ని ఏరియాల నుంచి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. చూసిన వారందరూ బావుందంటున్నారు. నివాస్‌ గోగుల పాటి మంచి ప్లానింగ్‌తో రిలీజ్‌ చేశారు. స్వాతినాయుడు పర్ఫార్మెన్స్‌, సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ నెల 18న నైజాంలో రిలీజ్‌ చేయనున్నాం’’ అని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నివాస్‌ గోగుల పాటి మాట్లాడుతూ…‘‘ఆంధ్రప్రదేశ్‌లో 40 సెంటర్స్‌లో విడుదల చేశాం. థియేటర్స్‌లో రెస్పాన్స్‌ బావుంది. లవ్, రొమాన్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌, ఇలా ఆల్‌ ఎమోషన్స్‌తో మా దర్శకుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దారు. స్వాతినాయుడు నటన హైలెట్‌ గా నిలు స్తోంది. ఈ నెల 18న నైజాంలో భారీగా రిలీజ్‌ చేస్తున్నాం’’ అని తెలిపారు.

Aamekorika Movie Success Meet

నిర్మాత చిక్కల సత్యనారాయణ మాట్లాడుతూ..‘‘చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. నటి స్వాతినాయుడు మాట్లాడుతూ..‘‘యాక్టింగ్‌కి స్కోపున్న సినిమా ఇది. టైటిల్‌ని చూసి వేరే విధంగా అనుకోవద్దు. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా సినిమా చూడొచ్చు. మా సినిమాను ఇంకా పెద్ద సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నివాస్‌ గోగుల పాటి, కెమెరా: ప్రసాద్‌, సంగీతం: తలారి శ్రీనివాస్‌, నిర్మాతలు: చిక్కల సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌, కథ-మాటలు -స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వ్లభనేని సురేష్‌ చౌదరి.