సెలెబ్రిటీలుగా ఎంత పాపులారిటీ వచ్చినా అది జనం ఇచ్చిందే అనే బేసిక్ మర్చిపోతే ఎవరికైనా మనుగడ ఉండదు. అది గుర్తించారు కాబట్టి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా 60 ఏళ్ళు దాటిన సీనియర్ హీరోలు ఇంకా తమ అభిమానుల చేత కీర్తింపబడుతూనే ఉన్నారు. అది కేవలం వాళ్ళు చేసిన సినిమాల వల్ల సాధించుకున్నది కాదు. తమ వ్యక్తిత్వం ద్వారా కూడా ఆ అభిమానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అందులో తేడా వస్తే పరిణామాలు వేరుగా ఉంటాయి. తాజాగా యాంకర్ అనసూయ ఒక చిన్న కుర్రాడి పట్ల వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలోనే కాక బయట కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
అసలు విషయానికొస్తే.. ఒక పని నిమిత్తం హైదరాబాదులోని తార్నాక ప్రాంతానికి అనసూయ వెళ్లింది. అదే సమయంలో తన తల్లితో పాటు ఓ బాలుడు అటుగా వెళ్తున్నాడు. అనసూయ కనిపించగానే ఆమె వద్దకు వెళ్లి, అభిమానంతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. తమ మొబైల్ ద్వారా ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించగా… ఇది గమనించిన అనసూయ ఆగ్రహంతో బాలుడి చేతిలోని ఫోన్ ను లాక్కుని, నేలకేసి కొట్టింది.
అక్కడ జరిగిన ఘటనతో తల్లీకుమారుడు ఇద్దరూ బిత్తరపోయారు. ఫోన్ ఎందుకు పగలగొట్టావని బాలుడి తల్లి ప్రశ్నించగా… సమాధానం చెప్పకుండానే, వారిని దుర్భాషలాడుతూ అనసూయ అక్కడి నుంచి వెళ్లి పోయింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమను చాలా గలీజు మాటలతో తిట్టిందని ఫిర్యాదులో పేర్కొంది.
దీనికి అనసూయ కూడా తన ట్విట్టర్ లో మెసేజ్ ద్వారా స్పందించింది. పోలీసుల సత్వర స్పందన బాగుందని – తనను ట్యాగ్ చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. ఫోన్ విరిగిపోవడం పట్ల తనకు విచారంగానే ఉందన్న అనసూయ తమ ప్రైవసీని గౌరవించాలని కోరింది. జరిగింది ఏమిటి అనేది పూర్తిగా అందులో వెల్లడించపోయినా ఇదేమి దేశం మొత్తం చర్చించాల్సిన విషయం కాదని చెబుతూ తనను అభిమానించే వాళ్ళకు నిజాలు తెలియాలనే మెసేజ్ పెడుతున్నట్టు చెప్పింది.
Good to know the Police is so prompt! But sir you should get into the details before I am being tagged🙈 #Respect 🙏🏻 https://t.co/zb3REqf7Ue
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 6, 2018
Not that the country needs such news.. but.. to those whom I am answerable.. #facts 😌
I am sorry her phone broke but i think its not fair that i should be blamed for what i remotedly didn’t.. we owe our privacy.🙏🏻 https://t.co/vAjqQ8glfu— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 6, 2018