అజిత్‌తో నయన్‌…విశ్వాసం

254
Ajith And Nayan Pair Up again..
- Advertisement -

తలా అజిత్…లేడి సూపర్ స్టార్ నయనతార..ఈ కాంబినేషన్‌కు ఉండే క్రేజే వేరు. కోలీవుడ్‌లో అగ్రకథనాయకుడిగా యూత్‌…ఫ్యామిలీలో మంచి పేరు తెచ్చుకున్న అజిత్ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో విశ్వాసం సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేయనుండగా…ఇద్ద‌రు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా న‌య‌న‌తార ను ఎంపిక చేశారు. గతంలో అజిత్ తో కలిసి నయనతార బిల్లా మూవీలో నటించింది. అయితే ఆమె స్టార్ డమ్ పెరిగిన తరువాత అజిత్ కలిసి చేస్తోన్న సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అంతేగాదు ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

ajith-nayanthara

దీనికి తోడు ‘వీరమ్’ .. ‘వేదాళం’ .. ‘వివేగం’ మూవీల‌తో అజిత్‌కు సూప‌ర్ హిట్స్ ఇచ్చిన శివ ఈ మూవీ కి ద‌ర్శ‌కుడు కావడంతో మరోసారి హిట్ కొట్టడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. కాగా మ‌రో హీరోయిన్ గా అనుష్క ను తీసుకోవాల‌ని అనుకుంటున్నారు.. ఇప్ప‌టికే ఆమెతో చిత్ర యూనిట్ క‌థ చ‌ర్చ‌లు జ‌రిపింది.. ఇప్ప‌టి వ‌ర‌కూ అనుష్క ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. ఒక వేళ ఆమె ఓకే అంటే ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ హీరోయిన్స్ ను ఒకే తెరపై చూసే అవ‌కాశం ప్రేక్ష‌కుల‌కు ద‌క్కుతుంది.

- Advertisement -