ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు వైఎస్ జగన్.తాడేపల్లిలోని తన ఇంటి నుంచి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్న జగన్ మొదటి బ్లాక్‌లో సీఎం చాంబర్లో అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తన చాంబర్‌లోని కుర్చీపై ఆసీనులయ్యారు జగన్. అనంతరం సచివాలయంలో ఆశావర్కర్లకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు, కొత్తగా ఎంపికైన మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు సీఎం జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
అనంతరం 9.15 గంటలకు సచివాలయం గ్రౌండ్‌కు చేరుకుని ఉదయం 11.30 గంటల వరకు అక్కడే ఉంటారు. అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘంతో ఆయన సమావేశం కానున్నారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చినఅప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతారు. మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం తర్వాత వైఎస్ జగన్ తొలి కేబినెట్ సమావేశం కానుంది.