వైసీపీపై మరోసారి పీకే సంచలన కామెంట్స్

11
- Advertisement -

వైసీపీ ఈసారి ఏపీలో ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని…. ఆపార్టీ 151 స్థానాల నుండి 51 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల, విజయమ్మ ప్రచారం చేయడం అది వైసీపీకి మైనస్‌గా మారిందన్నారు.

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్..తాను జగన్‌ను తిట్టడం లేదని, కేవలం జోస్యం మాత్రమే చెబుతున్నానని స్పష్టం చేశారు.సంక్షేమం ప్రభుత్వ సొమ్ము అని, ఏ నాయకుడు వ్యక్తిగత సొమ్ము ఇవ్వడం లేదన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ప్రధాన సమస్యల్లో డబ్బు ఒకటని …చంద్రబాబును స్వాగతించడం కంటే జగన్‌ను దూరం పెడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్డీయేకు కాకుండా జగన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతం ఏపీలో ఫలితాలపై భారీ బెట్టింగ్‌లు జరుగుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ సీటు, అవినాష్ సీటు, జగన్ సీటుపై బెట్టింగ్ జరుగుతోందని..పులివెందులలో జగన్ మెజార్టీపై పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతుందన్నారు.

Also Read:Harish:బీజేపీకి ఓటేస్తే నీళ్లు లేని బావిలో పడ్డట్లే

- Advertisement -