మళ్లీ మెగా ఆఫర్ కొట్టేసిన రంగమ్మత్త..!

431
Anasuya
- Advertisement -

యాంకర్ అనసూయ సినీ ప్రేక్షుకులు ఈపేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటన, యాంకరింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రంగస్ధలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచేసుకుంది. ఓవైపు బుల్లితెరపై కామెడీ షోలు చేస్తూనే మరోవైపు మంచి మంచి పాత్రలు దక్కినప్పుడు సినిమాల్లో కూడా నటించి మెప్పిస్తుంది.

తాజాగా ఈ బ్యూటీకి బంపర్ ఛాన్స్‌ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో అనసూయ ఫుల్ లెంత్ క్యారెక్టర్ నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే కొరటాల శివతో మూవీ అక్టోబర్‌లో పట్టాలెక్కనుంది.

ఇక రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా మెప్పించింది అనసూయ. రంగమ్మత్త పాత్ర అనసూయకి మంచి పేరును తీసుకువచ్చింది . అ తర్వాత అంతా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమె నటించింది లేదు.తాజాగా కొరటాల శివ మూవీలో అలాంటి పాత్రే దక్కనుందని సమాచారం. మొత్తంగా మెగాస్టార్‌తో నటించే అవకాశం దక్కడంతో ఉబ్బితబ్బైపోతోంది రంగమ్మత్త.

- Advertisement -