అభిమానిలా ఫీలై సినిమా చేస్తా – బోయ‌పాటి

269
boyapati
- Advertisement -

మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌, కియరా అద్వాని హీరో హీరోయిన్‌గా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వినయవిధేయరామ’. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ …వినయం విధేయత ఉంది కాబట్టే రాముడయ్యాడు. ఈ రాముడు ఫ్యామిలీ పట్ల విధేయుడు. ఆ విధేయత ఏ స్థాయిలో ఉంటుందనేది మీరు సినిమా లో చూస్తారు. ఈ సినిమా ట్రైలర్ లో రామ్ చరణ్ కటౌట్ చూస్తుంటే ఐరన్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. ఆ బాడీలో ఈ రోజు ఉన్న మెచ్యూరిటీ నాలుగేళ్ల క్రితం లేదు. అందుకే పర్ఫెక్షన్ కోసం టైమ్ తీసుకోవాల్సి వచ్చింది.

vinaya vidheya rama
ఈ సినిమాకి ఇదే కరెక్ట్ టైమ్.నేను చేసిన సినిమాలు ‘భద్ర’ నుండి బిగిన్ అయితే ‘వినయ విధేయ రామ’ వరకు ఫ్యామిలీ ఇమోషన్స్ కే ఫస్ట్ ఫౌండేషన్ ఉంటుంది. ఆ తరవాతే సొసైటీ గురించి.. కథలో ఇంకా స్కోప్ ఉందనుకుంటే తక్కిన విషయాల గురించి ఆలోచిస్తా.‘వినయ విధేయ రామ’ విజన్ నుండి విజువల్ వరకు ఉన్న మెయిన్ కనెక్టివిటీ రామ్ చరణ్.. ఆయన లేకపోతే ఇది సాధ్యపడేది కాదు. సినిమా అంటే పండుగ‌. పండుగ‌ని అభిమానుల వరకు చేర్చాలంటే ఆర్టిస్ట్ నన్ను నమ్మాలి. వాళ్ళు నన్ను నమ్మాలంటే వాళ్ళకన్నా ముందు నేను పదింతలు ఎక్సర్ సైజు చేసి, వాళ్ళను ఇన్స్ పైర్ చేయగలగాలి. ఈ ప్రాసెస్ లో ఆర్టిస్టుల కన్నా కథలో నేనే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాను.

- Advertisement -