సీబీఐ డెరెక్టర్‌గా తెలంగాణ తేజం..

266
Nageshwar Rao
- Advertisement -

సీబీఐ డైరెక్టర్‌గా తెలుగుతేజం మన్నెం నాగేశ్వరరావు మరోసారి అవకాశం దక్కించుకున్నారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పు వెలువరించిన 48గంటల్లోనే ఆయన్ని బదిలి చేసింది. సీబీఐకి కొత్త డైరెక్టర్‌ను నిర్వహించేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ బాధ్యతల్లో నాగేశ్వర రావు కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

వరంగల్ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్‌కు చెందిన వ్యక్తి మన్నెం నాగేశ్వరరావు. ప్రస్తుతం సీబీఐలో జాయింట్‌డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ఒడిషా కేడర్‌లో డీజీపీగా పనిచేశారు.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా మధ్య మొదలైన ‘వర్గ పోరు‌’తో ఆ సంస్థపై నీలినీడలు అలుముకున్న సంగతి తెలిసిందే. ప్రధాని సీబీఐని భ్రష్టు పట్టిస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో కేంద్రం సీరియస్‌గా పరిగణించింది. అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -