జ‌న‌వ‌రి 10లోపే పంచాయితీ ఎన్నిక‌లు..

240
nagireddy
- Advertisement -

జ‌న‌వ‌రి 10లోపే పంచాయితీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌న్నారు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నాగిరెడ్డి. పంచాయితీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన విష‌యాల‌పై ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత 23 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని, మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కోర్టును కొంత సమయం కోరామని, ఆ తర్వాత కూడా చట్ట ప్రకారం ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాల్సి ఉంటుందని చెప్పారు.

- Advertisement -