మంచి కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో టాప్ రేంజ్ కు ఎదిగిపోయాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా నుంచి కృష్ణార్జున యుద్దం వరకూ అన్ని సినిమాలు విజయాన్ని సాధించాయి. కొత్త కొత్త కథలతో సినిమాలు చేసుకుంటూ కొత్త దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు నాని. ప్రస్తుతం నాని, నాగార్జున కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ సినిమా తెరకెక్కుతుంది.
ఈసినిమాకు శ్రీరామ్ ఆదిత్య అనే యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాలో నాగార్జున కంటే నాని పాత్రకే ఎక్కువ సమయం ఉంటుందని సమాచారం. అంతేకాకుండా నాని నటించబోయే పాత్ర సినిమాకే హైలెట్ గా నిలవనుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరగుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ సగం వరకూ పైర్తైందని చెబుతున్నారు చిత్ర బృందం.
ఇక ఈసినిమా కోసం నాని తన రెమ్యూనషన్ కూడా పెంచినట్లు సమాచారం. తనకు ఉన్న క్రేజ్ ప్రకారం భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్టు తెలుస్తోంది. అదే సినిమాలో హీరోగా నటిస్తోన్న నాగార్జున కన్నా నాని రెట్టింపు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఈసినిమా మొత్తానికి నాగార్జునకు రూ.4కోట్లు ఇవ్వగా..నానికి రూ.8 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో నాని పాత్ర ఎక్కువగా ఉండటం వల్ల తన రెమ్యూనరేషన్ ను పెంచేశాడు నాని. ఇక నాని రేపటి నుంచి బిగ్ బాస్ షో యాంకర్ గా చేస్తుండటంతో అతనికి మరింత క్రేజ్ రానుంది. వరుస షూటింగ్ లతో బిజిగా ఉన్న నాని..బిగ్ బాస్ షో వల్ల తన సినిమాలు కొంచెం ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉంది.