త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని..

160
Trivikram Nani

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్‌ రియాల్టీ షోతో బిజీగా ఉన్నాడు. ఈ షో చేస్తూనే తన సినిమాలపై దృష్టి సారించిన నాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాతా నానితో మూవీ పట్టాలెక్కనుంది. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సినిమాతో పాటు గజదొంగ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నాని నటించనున్నాడని టాక్. ఎన్నో బ్యాంకుల‌ని కొల‌గొట్టి చివరికి ఒక భారీ ఎంకౌంటర్లో చనిపోయాడు నాగేశ్వరరావు. ఆయ‌న పాత్ర‌లో న‌టించేందుకు నాని నటించనుండగా కిట్టువున్నాడు జాగ్రత్త’ను తెరకెక్కించిన వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమాతో పాటు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. నాగార్జున,నాని ప్రధానమైన పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం నాని…నాగార్జున కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. మొత్తంగా నాగ్ కంటే నాని ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.