పైసా ఖర్చు లేకుండా.. వైద్య పరీక్షలు:కేటీఆర్

218
ktr
- Advertisement -

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. నారాయణగూడ ఐపీఎం క్యాంపస్‌లో వ్యాధి నిర్దారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌ను మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించిన కేటీఆర్…వైద్య వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పారు.

సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామని తెలిపిన కేటీఆర్…. ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తామన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 40-50శాతం పెరిగిందని…. పట్టణంలోని పేదవారి కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 17 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని చెప్పారు.

ఇవాళ తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి అన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంకతముందు ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో ఉచితంగా 53 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు.

- Advertisement -