ఈ తరంలో టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కెరీర్ కొనసాగించిన హీరోయిన్లలో శ్రేయదే రికార్డు. దాదాపు 17 సంవత్సరాలకు పైగా హీరోయిన్ గా కొనసాగుతూ చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి పక్కన ఆడి పాడింది. తర్టీస్ లోనూ హాట్ ఫోజులతో.. గ్లామర్ లుక్స్ తో కనిపించి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ దృష్టిని ఆకట్టుకునేది. ఈమధ్య తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూను పెళ్లి చేసుకున్న శ్రేయ సినిమాలకు కాస్త గ్యాపిచ్చింది. కొంతకాలం భర్తతో మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేశాక మళ్లీ సినిమాల వైపు దృష్టి పెట్టింది. తిరిగి సౌత్ లో ఛాన్సులు దక్కించుకోవాలని ఆరాట పడుతోంది.
తాజాగా చిత్రసీమలో పురుషాధీక్యత, చిత్రీకరణ మధ్యలో పాత్రల రూపురేఖల్ని మార్చే విధానంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది శ్రియ. ఆమె మాట్లాడుతూ హీరోలతో పోల్చితే తెరపై కథానాయికలు కనిపించే నిడివి చాలా తక్కువగా ఉంటుంది. పరిశ్రమలో పూర్తిగా పురుషాధీక్యతే కనిపిస్తుంది. కథాంశాలన్నీ హీరోయిజం ప్రధానంగానే వుంటాయి. దీనివల్ల కథానాయికలు ఎలాంటి స్క్రిప్ట్‌లు ఎంచుకోవాలనుకునే విషయంలో తీవ్రమైన సంఘర్షణకు గురవుతుంటారు.అన్యమనస్కంగానే సినిమాలకు ఓకే చెబుతుంటారు. సినిమాల పరంగా నేను ఎన్నో తప్పుల్ని చేశాను.
కొన్ని సినిమాల్ని ఎందుకు చేశానా అని బాధపడిన సందర్భాలున్నాయి. అయితే ఇటీవలకాలంలో నాకు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. అభినయప్రధాన పాత్రలు దక్కుతున్నాయి అని చెప్పింది. ఎవరైనా దర్శకుడు సినిమాకోసం సంప్రదిస్తే స్క్రిప్ట్ మొత్తం ఇస్తేనే చిత్రాన్ని అంగీకరిస్తానని చెప్పింది శ్రియ. క్లుప్తంగా కథ చెబితే నాకు నచ్చదు.
స్క్రిప్ట్ మొత్తం తెలుసుకుంటేనే సినిమాకు ఓకే చెబుతా. ఎందుకంటే ఒక్కోసారి మనకు చెప్పిన కథకు, తెరపై తీసుకొచ్చిన విధానానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ సమయంలో మనం బాధపడటం మినహా ఏమీ చేయలేం. ఇక కొందరు దర్శకులు సెట్స్‌లోనే పాత్రల తీరుతెన్నుల్ని మార్చేసుంటారు. ఈ విధానం నాకు అస్సలు నచ్చదు అని శ్రియ పేర్కొంది.