బూతుల కోసం థియేటర్స్ కి రావాలా?

25
- Advertisement -

నేటి సినిమాల్లో బూతులే నీతులుగా చలామణి అవుతున్నాయి. అందుకేనేమో.. నిండు సభలో బాలయ్య బాబు తన పుత్ర రత్నం.. నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ ? అంటూ తనను తిట్టాడని స్వయంగా బాలయ్యే చెప్పుకున్నాడు. అది కూడా తన మూవీలో శ్రీలీల హీరోయిన్ గా యాక్ట్ చేద్దామని బాలయ్య చెప్పడంతో మోక్షజ్ఞ తన తండ్రిని అలా తిట్టేశాడు. సీనియర్ ఎన్టీఆర్ చిన్న పిల్లలను కూడా ‘మీరు’ అంటూ గౌరవంగా పిలుస్తారు. అలాంటి ఆయనకు వారసులుగా చలామణి అవుతున్న బాలయ్య, ఆయన కొడుకు మాట తీరు మాత్రం చాలా అద్వానంగా తయారు అయింది.

సరే.. బాలయ్య సంగతి పక్కన పెడితే.. ‘గు- పగుల దెం-తే రేప్పొద్దన ట్యాంక్ బండ్‌లో తేలతవ్ బే మా- లౌ-‘.. బహుశా ఈ మాట చదవడానికి కూడా చాలామందికి ఇబ్బందిగా అనిపించొచ్చు. ఇంతకీ, ఈ మాట ఏ సినిమాలోది ?, ది గ్రేట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమ కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్ గమ్ అనే సినిమాలోది ఈ డైలాగ్. అంతేనా.. ఈ సినిమా ట్రైలర్ లో లెక్కకు మించిన బూతులు ఉన్నాయి. అనేక వెగటు బిట్ లు ఉన్నాయి. సదరు హీరో గారు అర్జున్ రెడ్డి తమ్ముడిలా రెచ్చిపోయారు. అసలు ఆరంగేట్రంలోనే లిప్ లాక్ లతో సుమ కొడుకు ఈ స్థాయిలో ముదురిపోయాడు ఏమిటి ? అని నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Also Read:Bigg Boss 7 Telugu:పోటుగాళ్లదే గెలుపు

సుమకి పద్దతి అయిన యాంకర్ గా పేరు ఉంది. కానీ, తన కొడుకు సినిమా ట్రైలర్ దెబ్బతో ఆ పేరు కాస్త మసగబారేలా ఉంది. అసలు ట్రైలర్ లోనే ఈ రేంజ్ వెగటుదనం ఉందంటే ఇక సినిమా ఎలా ఉండబోతోందో!!. ఈ మధ్య తెలుగు సినిమాల పరిస్థితి ఏమీ బాగాలేదు. సుదీర్ఘమైన లిప్ లాక్ లు… పిచ్చి పిచ్చి బూతు డైలాగులు.. సర్వసాధారణం అయిపోయాయి. మరి ఈ గలీజుతనం నిండిన కథలతో ఏ మాత్రం హిట్ లు కొడదాం అని ?. బూతు విచ్చలవిడి స్థాయిలో యువత చేతుల్లో స్మార్ట్ ఫోన్ రూపంలో ఉంది… మరి ఈ చిన్నాచితకా బూతులు, లిప్‌లాకుల కోసం వాళ్ళు థియేటర్స్ కి వస్తారా ?.

Also Read:నాని..హాయ్ నాన్న రిలీజ్ డేట్ ఫిక్స్!

- Advertisement -